సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌)

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లిలో ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’, ‘సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌) నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. సాహసోపేత నిర్ణయాలకు చిరునామా అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రతి పౌరునికి పారదర్శక పాలన అందించి సంక్షేమ పథకాలను ప్రతి పౌరుని ఇంటికి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నడిపిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం సహకారం కీలకం, రాబోయే రోజుల్లో నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి పూర్తి సహాయసహకారాలు అందనున్నాయి. రాష్ట్రంలోని యువతకు , ముఖ్యంగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అందించడం కోసం ప్రభుత్వం నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగవకాశాలను పెంచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాము